Thursday, November 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 23
23.
ఓం తత్సదితి నిర్దేశో
బ్రహ్మణస్త్రివిధ : స్మృత: |
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ
యజ్ఞాశ్చ విహితా: పురా ||

తాత్పర్యము : సృష్ట్యారంభము నుండియు ”ఓం, తత్‌, సత్‌” అను మూడు పదములు పరతత్త్వమును సూచించుటకు వాడబడినవి. వేదమంత్రములను ఉచ్చరించునపుడు, పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణము కావించునపుడు ఈ మూడు సంజ్ఞాపదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుచుండేడివి.

భాష్యము : ఇప్పటి వరకూ యజ్ఞ, దాన, తపస్సులు మరియు ఆహారము సత్త్వ రజో తమో గుణముల ప్రకారము వివరించడము జరిగినది. అవి త్రిగుణములచే కలుషితమై ఉండుటచే ఆ కార్యముల యందు పవిత్రత కొరవడుచున్నది. శాస్త్ర నిర్దేశానుసారము చేయనిదే పరతత్త్వాన్ని పొంలేరు. తాత్కాలిక ఫలితములు వచ్చినా జీవిత లక్ష్యాన్ని చేరుకోలేరు. కాబట్టి కనీసము సత ్త్వ గుణములో ఈ కార్యములను చేయవలసి ఉన్నది. అంతకంటే ఉత్తమమైనది భగవంతుని కోసము చేయుట. అనగా ”ఓం తత్‌ సత్‌” అను పదములు భగవంతుణ్ని సూచించును. ఈ పదములు వేదములను నుంచి గ్రహింపబడినవి. తొలుత బ్రహ్మ ఈ పదములను ఉపయోగించి భగవంతుని ప్రసన్నార్థము యజ్ఞమును నిర్వహించుటచే నేటికీ పసరంపరానుగతముగా ఇది కొనసాగుచూవచ్చుచున్నది. ఈ విధముగా మనము చేయు కార్యములను భగవంతుని ప్రసన్నార్థము చేసినట్లయితే ఆధ్యాత్మిక పురోగతి సాధించి చివరకు భగవద్ధామమును చేరుకొనవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement