అధ్యాయం 17, శ్లోకం 22
22.
అదేశకాలే యద్దానమ్
అపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్కృతమవజ్ఞాతం
తత్తామసముదాహృతమ్ ||
తాత్పర్యము : అపవిత్ర ప్రదేశమునందు తగని సమయమున అపాత్రులకు ఒసగబడునటువంటిది లేదా తగిన శ్రద్ధ మరియు గౌరవము లేకుండా ఒసగబడునటువంటిదైన దానము తమోగుణప్రధానమైనది.
భాష్యము : మద్యపానమును జూదమును ప్రోత్సహించుటకు చేయు సహాయములు ఇక్కడ నిరసించబడ్డాయి. అవి ఎటువంటి మేలు చేయవు సరికదా, పాపులను ప్రోత్సాహిస్తాయి. అలాగే సరైన వ్యక్తికి దానము చేయునపుడు కూడా అశ్రద్ధగా, అమర్యాదగా ఉన్నా అది తమోగుణము క్రిందకే వస్తుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..