Wednesday, November 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 20
20.
దాతవ్యమితి యద్దానం
దీయతే నుపకారిణ |
దేశే కాలే చ పాత్రే చ
తద్దానం సాత్త్వికం స్మృతమ్‌ ||

తాత్పర్యము : ప్రతిఫల వాంఛ లేకుండా సరియైన ప్రదేశమున మరియు సరియైన సమయములలో, మాసము చివరిలో యోగ్యుడైన బ్రాహ్మణునికి లేదా వైష్ణవునికో లేదా దేవాలయములలో తిరిగి దేనినీ ఆశించకుండా దానము చేయవచ్చును. అనగా ఎవరికి పడితే వారికి విచక్షణా రహితముగా దానము చేయరాదు. పేదవారికి కరుణతో దనాము చేయవచ్చును గాని, వారు దానిని దుర్వినియోగము చేయని విధముగా దానము ఇవ్వవలెను. లేదంటే అధ్యాత్మిక ప్రయోజనము చేకూరదు. కాబట్టి దానము చేయుటలో ఎంతో విచక్షణ ఉపయోగించవలసి ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement