Thursday, November 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 18
18.
సత్కారమానపూజార్థం
తపో దంభేన చైవ యత్‌ |
క్రియతే తదిహ ప్రోక్తం
రాజసం చలమధ్రువమ్‌ ||

తాత్పర్యము : గౌరవము, సన్మానము, పూజలందుకొనుట కొరకు గర్వముచే ఒనర్చుబడు తపస్సు రజోగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. అది స్థిరముగాని, శాశ్వతముగాని కాజాలదు.

భాష్యము : కొన్ని సార్లు జనాకర్షణ కొరకు, గౌరవము పొందుట కొరకు, ఇతరులచే పూజింపబడుటకు తపస్సులను నిర్వహించుచూ ఉందురు. కొన్ని సార్లు తమ అనుచరులు తమను పూజించేందుకై బహిరంగ ఏర్పాట్లు చేసి పాదపూజలు, కానుకలను స్వీకరించుచూ ఉందురు. ఇవన్నీ రజోగుణమునకు సంబంధించినవి. వాటి ఫలితాలు తాత్కాలికముగా కొంత కాలము కొనసాగినా అవి శాశ్వతమైనవి కావు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement