Sunday, September 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 16
16.
మన:ప్రసాద: సౌమ్యత్వం
మౌనమాత్మవినిగ్రహ: |
భావసంశుద్ధిరిత్యేతత్‌
తపో మానసముచ్యతే ||

తాత్పర్యము : తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వమును పవిత్రమొనర్చుట యనునవి మానసిక తపస్సనబడును.

భాష్యము : మనస్సు యొక్క ముఖ్యమైన తపస్య ఇంద్రియ భోగ వాంఛల నుండి దూరముగా ఉంచుట. ఎంతగా ఆనందించటానికి మనస్సు ఆలోచనలు చేస్తుందో అంత అసంతృప్తికి గురౌతుంది. నేడు రకరకాల ఇంద్రియ భోగాలకు అవకాశము ఉండుట చేత ప్రజల మన స్సులు అసంతృప్తితో నిండి ఉన్నాయి. కాబట్టి మనస్సు ఉన్నత ఆలోచనలను కలిగి జీవిత లక్ష్యము పై స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అందుకై వేదముల వైపునకు మనస్సు మళ్ళించవలెను. ఆ విధముగా మనస్సు పవిత్రతను పొందగలదు. అలాగే ఆలోచించుటకు శిక్షణ పొందుటయే మానసిక తపస్సు కాగలదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement