అధ్యాయం 17, శ్లోకం 15
15.
అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ
వఙ్మయమ్ తప ఉచ్యతే ||
తాత్పర్యము : సత్యమును, ప్రియమును, హితకరమును, అనుద్వేగకరమును అగు వచనములను పలుకుట మరియు నిత్యము వేదపారాయణము చేయుట అనునవి వాక్కునకు సంబంధించిన తపస్సనబడును.
భాష్యము : వేరేవారికి కలత కలిగే విధముగా మాట్లాడరాదు. గురువు తన శిష్యులతో సత్యాన్ని బోధించుటకు కఠినముగా మాట్లాడినా మిగిలిన వారికతో అలా వ్యవహరించరాదు. అంతేకాక ఇష్టానుసారము అర్థము లేని వాటిని మాట్లాడరాదు. ఉన్నతమైన వ్యక్తులు మాట్‌డుకునేటప్పుడు శాస్త్ర ఆధారముగా మాట్లాడి, నిరూపణలు ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా ప్రీతి కలిగే విధముగా వ్యక్తపర చవలసి ఉంటుంది. అటువంటి చర్చల వలన ఉన్నత ఆలోచనలు వృద్ధి చెంది మానవ సమాజమునకు ఎంతో మేలును చేస్తాయి. అపారమైన వేదములను అధ్యయనము చేయుటకు సంకల్పించవలెను. ఇవన్నీ వాక్ తపస ్య క్రిందకు వస్తాయి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..