Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 13
13.
విధిహీనమసృష్టాన్నం
మంత్రహీనమదక్షిణమ్‌ |
శ్రద్ధావిరహితం యజ్ఞం
తామసం పరిచక్షతే ||

తాత్పర్యము : శాస్త్ర నిర్దేశముల యెడ గౌరవము లేకంఉడ, ప్రసాదవితరణము కాని, వేదమంత్రోచ్చారణము గాని, బ్రాహ్మణదక్షిణలు కాని లేకుండ శ్రద్ధారహితముగా ఒనర్చబడు ఏ యజ్‌మైనను తామసగుణ ప్రధానమైనదిగా భావించపబడును.

భాష్యము : తమో గుణములో విశాసమనగా, విశ్‌సము లేని తనము అని చెప్పవచ్చును. కొన్ని సార్లు ధనము సంపాదించి జల్సా చేయుటకు దేవీ దేవతల పూజలు నిర్వహించుచుందురు. అటువంటి పూజలు పునస్కారాలు శాస్త్ర ఆధారము లేక బూటకపు తంతులే కాగలవు గాని వాస్తవమైన యజ్ఞాలు కాలేవు. ఆ విధమైన తమో గుణము అసుర ప్రవృత్తినే పెంపొందిస్తుంది. కనుక మానవ సమాజమునకు హితము చేయదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement