Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 11
11.
ఆఫలాకాంక్షిభిర్యజ్ఞో
విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మన:
సమాధాయ స సాత్త్విక: ||

తాత్పర్యము : శాస్త్ర నిర్దేశానుసారము తమ విధి యని తలచబడుచు ఫలములు కోరినవారిచే చేయబడు యజ్ఞము యజ్ఞములందు సాత్త్విక యజ్ఞమనబడును.

భాష్యము : ప్రజలు సహజముగా ఏదైనా భౌతిక ఫలితాన్ని ఆశించి భగవంతుణ్ని పూజించుదురు. భౌతిక లాభము లేనప్పుడు భగవంతుడి దగ్గరకు వెళ్ళవలసిన అవసరమేమున్నది అని వారు భావించెదరు. అయితే ఈ శ్లోకము ప్రకారము అది శాస్త్ర సమ్మతము కాదు. ప్రత్యేకించి సత్వగుణమును వృద్ధి చేయదు. శాస్త్రాలను అసుసరించుట, భగవంతునికి కృతజ్ఞ తలున తెలుపుట ప్రతి నాగరిక మానవుని యొక్క బాధ్యత. ఆ విధముగా కర్తవ్యమని భావించి బగవంతుని దగ్గరకు వెళ్ళువారు సత్వ గుణమును పెంపొందించుకుందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement