అధ్యాయం 7, శ్లోకం 18
ఉదారా: సర్వ ఏవైతే
జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థిత: స హి యుక్తాత్మా
మామేవానుత్తమాం గతిమ్ ||
తాత్పర్యము : ఈ భక్తులందరును నిస్సంశయముగా ఉదాత్తులే యైనను వీరిలో నా జ్ఞానము నందు స్థితుడైనవానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగతియైన నన్ను తప్పక పొందగలడు.
భాష్యము : భగవంతుని ఆశ్రయించే నలుగురూ భగవంతునికి ప్రియులే, వారు భగవంతునికి దగ్గరకు వచ్చి భౌతిక ప్రయోజనాలను తీర్చుకున్నా, భగవంతుని పట్ల శ్రద్ధ, ప్రీతి ఉండుట వలన భౌతిక కోరికలు తీరినప్పుడు సంతృప్తి చెంది, ఇంకా భక్తిలో ముందుకు కొనసాగే అవకాశము ఉం టుంది. అయితే భగవత్సేవకే అంకితమయిన భక్తుడున్న భగవంతునికి అత్యంత ప్రియము. అతనికి భగవంతుని సేవ తప్ప వేరే ధ్యాస లేదు, అలాగే భగవంతుడు కూడా అతని ని విడిచి ఉండలేడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..