Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 2
2.
శ్రీ భగవాన్‌ ఉవాచ
త్రివిధా భవతి శ్రద్ధా
దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ
తామసీ చేతి తాం శృణు ||

తాత్పర్యము : శ్రీ కృష్ణ భగవానుడు పలికెను : దేహధారి పొందిన త్రిగుణముల ననుసరించి శ్రద్ధ సాత్త్వికము, రాజసము, తామసము అనుచు మూడు విధములుగా నున్నది. ఈ విషయమును ఇప్పుడు ఆలకింపుము.

భాష్యము : శాస్త్ర నియమాలు తెలిసినప్పటికీ ఆసక్తి లేక నిర్లక్ష్యము చేసినట్లయితే వారు త్రిగుణములు చేత ప్రభావితము కాబడతారు. ఆత్మ భౌతిక ప్రపంచమునకు వచ్చినప్పటి నుండీ త్రిగుణముల చేత ప్రభావితమై ఒక రకమైన ఇష్టా అయిష్టాలకు అలవాటు పడుతుంది. అయితే సద్గురువు సాంగత్యములో ఆయన సూచనలను, శాస్త్రమును పాటించుట ద్వారా తన స్వభావాన్ని మార్చుకొనవచ్చును. అనగా క్రమేణ తమో గుణము నుండి సత్వ గుణమునకు, అలాగే రజోగుణము నుండి సత్వ గుణమునకు మార్పు చెందవచ్చును. కాబట్టి గుడ్డిగా త్రిగుణములలో ఏదో ఒక విధమైన విశ్వాసమును కలిగి ఉండుట ఉన్నత స్థితిని కలిగించలేదు. గురువు మార్గదర్శకత్వములో తెలివితేటలను ఉపయోగించి సరైన చోట విశ్‌సమును పెట్టినట్లయితే ఉన్నత స్థితికి ఎదుగవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement