అధ్యాయం 7, శ్లోకం 17
తేషాం జ్ఞానీ నిత్యయుక్త
ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోత్యర్థమ్
అహం స చ మమ ప్రియ: ||
తాత్పర్యము : వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుక్తసేవలో నియక్తుడై యుండెడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేనతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు.
భాష్యము : ఈ నలుగురిలోకి ఎవరైతే భగవద్ జ్ఞానముతో ‘నేను భగవంతుని’ అని సేవలో నిమగ్నుడవుతాడో అతడు ఉత్తముడు, భగవంతునికి మిక్కిలి ప్రియతముడు. వారందరూ కూడా శుద్ధ భక్తుని సాంగత్యములో క్రమేణా శుద్ధ భక్తిని పాటించవచ్చునేమో గాని, ఇతనికి వేరే భౌతిక కోరికలు లేని కారణముగా అతని సాధన స్థిరముగా కొనసాగుతుంది. భగవంతుని దివ్య స్థితిని ఎరిగి ఉన్న కారణముగా అతడు భౌతిక సాంగత్యముచే ప్రభావితుడు కాక పూర్తి రక్షణతో కొనసాగుతాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..