Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 18
18.
అహంకారం బలం దర్పం
కామం క్రోధం చ సం శ్రితా: |
మామాత్మపరదేహెషు
ప్రద్విషాంతో భ్యసూయకా: ||

18. తాత్పర్యము : మిథ్యాహంకారము, బలము, గర్వము, కామము, క్రోధములచే భ్రాంతులైన అసురస్వభావులు తమ దేహమునందు మరియు ఇతరుల దేహములందు నిలిచియునన్న దేవదేవుడనైన నా యెడ అసూయగలవారై నిజమైన ధర్మమును ధూషింతురు.

భాష్యము : ధనము, పేరు, పలుకబడి వలన అజ్ఞానముతో భగవంతుని అధికారాన్ని శాస్త్రములను ధిక్కరించును. ద్వేషముతో భగవంతుడవే వాడు లేడని, శాస్త్రములు ప్రమాణములు కావని రకరకాల వాదనలను చేయుచుందురు. తాను సర్వ స్వతంత్రుడనని శక్తి మంతుడని ఇష్టానుసారంము కార్యములను చేయుచుండును. తాను చేయు కర్మ వలన వచ్చే జన్మ ఆధారపడి ఉంటుందని, తాను భాద్యత వహించవలసి ఉంటుందని గుర్తించడు. అందువలన తన భవిష్యత్తును మంట గలుపుటే కాక వేరే వారిని కూడా హింసించుచూ ఉండును. తనకు సాటి ఎవరూ లేరని, తనను ఎవరూ ఆపలేరని భావించుచూ ఉం డును. ఎవరైనా తనను అడ్డగిస్తే తన శాయశక్తులా అతనిని అణచి వేయుటకు ప్రయత్నించును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement