Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 16
16.
అనేకచిత్తవిభ్రాంతా:
మోహజాలసమావృతా: |
ప్రసక్తా: కామభోగేషు
సతంతి నరకేశుచౌ ||

తాత్పర్యము : వారు ఈ విధముగా అనేక చిత్త విభ్రాంతులచే కలతనొంది, మాయాజాలముచే బద్ధులై ఇంద్రియభోగము నెడ
మిగుల అనురక్తిని పొంది నరకమున బడుదురు.

భాష్యము : అసురులు వీలైనంత ధనమును కూడబెట్టవలెనను ఆశతో అక్రమ దారులలో ధనమును సంపాదించెదరు. కర్మానుసారము మనకు రావలసిన ఆస్తి పాస్తులను మాత్రమే పొందగలమని భావింపక స్వశక్తితో అమితముగా ఐశ్వర్యాన్ని, అందాన్ని, డిగ్రీలను పొందవలెనని ప్రణాళికలు రూపొందించుకొనుచూ ఉండును. దీనివలన వారు ఒకరితో నొకరు పోటీ పడుచూ అసూయ, ద్వేషాలు, తగాదాలతో ప్రపంచమును నరకప్రాయము చేయుదురు. తమ స్వార్థము కోసము వేరే వారు ఏమైనా ఫరవాలేదు అని ఇతరులను ఉపయోగించుకొందరు. భగవంతుడనే వాడే లేడని, అందరూ దేవుళ్ళే నని, తమ ఇష్టానుసారము జీవించవచ్చునని మిగిలిన వారిని ప్రేరేపించుదురు. శాస్త్రముల పట్ల విశ్వాసము లేక స్వర్గమునకు వెళ్ళుటకు యజ్ఞములను చేయవలసిన అవసరము లేదని యంత్రాల ద్వారా వెళ్ళవచ్చునని రావణాసురునివలె ప్రయత్నాలు చేయును. ఇలా మోహ జాలములో చిక్కుకుని, వలలో చిక్కుకున్న చేపవలె గత్యంతరము లేక నరకానికి దారలు వేసుకొందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement