Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 13,14,15
13.
ఇదమద్య మయా లబ్ధమ్‌
ఇమం ప్రాప్స్యే మనోరథమ్‌ |
ఇదమస్తీదమపి మే
భవిష్యతి పునర్ధనమ్‌ ||

14.
అసౌ మయా హత: శత్రు:
హనిష్యే చాపరానపి |
ఈశ్వరోహమహం భోగీ
సిద్దోహం బలవాన్‌ సుఖీ ||

15.
ఆఢ్యోభిజనవానస్మి
కోన్యోస్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి మోదిష్య
ఇత్యజ్ఞానవిమోహితా: ||

13-15 తాత్పర్యము : ఆసురీస్వభావుడగు మనుజుడు ఇట్లు తలచును: ”ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది. నా ప్రణాళికలచే నేను మరింత ధనమును పొందుదును. ఇదియంతయు నాది. భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధినొందగలదు. అతడు నా శత్రువు. అతనిని నేను వధించితిని. ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. నేనే సర్వమునకు ప్రభువును. నేనే భోక్తను. పూర్ణుడను, శక్తిమంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యంత ధనశాలిని. నన్ను మించిన శ క్తిమంతుడుగాని, సుఖవంతుడుగాని వేరొకడు లేడు. నేను యజ్ఞ ముల నాచరింతును, దానమోసగుదును మరియు అట్లొనర్చి సంతోషము నొందును” ఈ విధముగా అట్టివారు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదురు.

భాష్యము : లేదు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement