అధ్యాయం 16, శ్లోకం 9
9.
ఏతాం దృష్టిమవష్టభ్య
నష్టాత్మానో ల్పబుద్ధయ: |
ప్రభవంత్యుగ్రకర్మాణ:
క్షయాయ జగతోహితా: ||
తాత్పర్యము : నష్టాత్ములును, అల్పబుద్ధులను అగు అసురస్వభావము గలవారు ఇట్టి అభిప్రాయముల నే అనుసిరంచుచు అహితములను, జగద్వినాశకరములను అగు ఘోరకర్మలలో నియుక్తులగుదురు.
భాష్యము : దానవులు ప్రపంచమునకు వినాశనమును కలిగించు కార్యములను చేయుచుందురు. తెలివితేటలు లోపించి, ఇంద్రియ తృప్తికి కొత్త కొత్త పద్ధతులను కనుగొని వీలైనంతగా ఆనందించుటకు ప్రయత్నించుదురు. అయితే వారు కనుగొన్నవే వారి వినాశనమునకు కారణమని గుర్తించు. వాటి వలన వేరే మానవుల పట్ల, జంతువుల పట్ల, మానవుని హింసాత్మక చర్యలు పెరుగుచున్నవని గమనించకుందురు. నేడు మనము అణ్వాయుధములు కనిపెట్టగలిగామని గర్వపడినా అవి ప్రపంచమును బూడిద చేయగలవు. ఈ శ్లోకము ఈ పరిమాణాల గురించి భవిష్యవాణి చెప్పుచున్నది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..