Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 6
6.
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్‌
దైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశ: ప్రోక్త:
ఆసురం పార్థ మే శృణు ||

తాత్పర్యము : ఓ పృథకుమారా! ఈ లోకమునందు దైవాసురులనెడి రెండు రకముల జీవులు కలరు. దైవీ గుణములను ఇది వరకే నేను వివరముగా తెలిపియుంటిని. ఇక అసుర స్వభావము గలవారి గుణములను నా నుండి ఆలకింపుము.

భాష్యము : శ్రీ కృష్ణుడు అర్జునున్ని దైవ లక్షములు కలవాడని ధైర్యము చెప్పి, ఇప్పుడు అసుర లక్షణములను వివరింపనారంభించెను. ఆచార్యుల మార్గ దర్శకత్వములో శాస్త్రములలో నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించువారు దైవ లక్షణులు. వారు ఒక క్రమ బద్ధమైన జీవితమును గడుపుచుందురు. ఇక అసుర ప్రవృత్తి కలవారు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుచూ ఎవరినీ లెక్క చేయరు. ఈ విధముగా శాస్త్రమునకు విధేయత లేదా అవిధేయతను బట్టి దైవ, అసురులను వేరు చేయవచ్చు. దేవతలు, దానవులు ఒకే ప్రజాపతి పిల్లలైనప్పటికీ ఈ లక్షణము వారిని వేరు చేయుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement