Saturday, November 23, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 15

న మాం దుష్కృతినో మూఢా:
ప్రప ద్యంతే నరాధమా: |
మాయయాపహృతజ్ఞానా
ఆసురం భావమాశ్రితా: ||

తాత్పర్యము : దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానమును హరింపబడినవారు, దానవప్రవృత్తియైన నాస్తికాభావమును కలిగియుండువారు నా శరణము నొందురు.

భాష్యము : భగవంతుణ్ణి ఆశ్రయించని వారిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటివారు మూఢులు: అనగా జంతువు వలే కష్టించుచూ అజ్ఞానములో నుందురు. గాడిదకు గడ్డి ఎక్కడైనా లభిస్తుంది. కానీ రోజంతా యజమానికి పనిచేసి చివ రకు అదే గడ్డిని పొందుతుంది. ఇలా ఎందుకూ
కొరగాని పనిలోనే మునిగి ఉండేవారే ముర్ఖులు. ఇక రెండవ వారు నరాధములు : అనగా నరులలో అధములు అని. ఈ అరుదైన మానవ జన్మ, మనలోని భగవద్భక్తిని మేల్కొలుపుటకే. ప్రత్యేకించి భక్తుల సాంగత్యములో భగవంతుని గురించి శ్రవణము చేసే అవకాశాన్ని వదులుకున్న వారిని నరాధములు అందురు. ఇక మూడవ వారు ‘మాయా పహృత జ్ఞానులు’ : ఎవరి జ్ఞానమైతే మాయచేత అపహరించబడినదో వారిని ఇలా పిలుచుదురు. వీరు సాధారణముగా గొప్ప విద్యావంతులుగా, కవులుగా, శాస్త్రజ్ఞులుగా పేరు పొందిన వారై ఉందురు. కాని భగవంతుడ్ని ఒక సాధారణ మానవునిగా భావిస్తూ, భగవద్గీతకు వక్ర భాష్యాలనిస్తూ, వారూ శరణాగతి పొందరు సరికదా వేరే వారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఇక ఆఖరి వారు : అసుర స్వభావము కలిగినవారు : వారు భగవంతుడే లేడని, అతడు ఈ భూమిపై అవతరించలేదని నాస్తిక వాదనలను గుప్పిస్తూ ఉంటారు. ఇటువంటి నాలుగు తరగతుల వారు శాస్త్రాలను, ఆచార్యులను ధిక్కరించి భగవంతుడ్ని ఆశ్రయించరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement