Sunday, November 24, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 4
4.
ధంభో దర్పోభిమానశ్చ
క్రోధ: పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య
పార్థ సంపదమాసురీమ్‌ ||

తాత్పర్యము : ఓ పార్థా! గర్వము, పొగరు, దురహంకారము, కోపము, పురుషత్వము, అజ్ఞానములనెడి లక్షణములు అసురస్వభావము కలిగినవారికి చెందినవి.

భాష్యము : ఈ శ్లోకము నందు నరకమునకు దారి తీయు అసుర లక్షణములు వివరింపబడ్డాఇయ. నియమములను పాటించపోయినా ఎంతో గొప్ప ధార్మికులని గర్వమును ప్రదర్శించుదురు. ధనము, విద్యా ఉన్నదని పరుషముగా ప్రవర్తించుదురు. అర్హత లేకున్నా వేరే వారు తమను గౌరవించాలని ఆశించుదురు. చీటికీ మాటికీ కోపముతో పరుషముగా మాట్లాడుదురు. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుదురు. ప్రామాణికులైన వారి మాటలను పెడచెవిన పెట్టెదరు. అట్టి వారు తల్లి గర్భము నుండీ ఈ లక్షణములను కలిగి ఉండి పెరిగే కొద్దీ వీటిని వృద్ధి చేసుకుందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement