Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 13

త్రిభిర్గుణమయైర్భావై:
ఏభి: సర్వమిదం జగత్‌ |
మొహితం నాభిజానాతి
మామేభ్య: పరమవ్యయమ్‌ ||

తాత్పర్యము : సమస్త విశ్వము సత్త్వరజస్తమోగుణములనెడి త్రిగుణములచే భ్రాంతికి గురియై గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను ఎరుగజాలకున్నది.

భాష్యము : ఈ ప్రపంచములో ప్రతి ఒక్కరూ త్రిగుణములచేత ప్రభావితులైన వారే. వారి బంధనాన్ని, స్వభావాన్ని బట్టి వేరు వేరు గుణాలకు ఆకర్షితులగుదురు. దానిని బట్టి వారి శరీరము, కర్మలు, సాంగత్యము ఉం డును. ఇలా మానవ సమాజాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు రకాలుగా విభజించవచ్చును. నేను అమెరికన్‌, ఇండియన్‌, రష్యన్‌, బ్రహ్మణ, హిందు,ముస్లిం ఈ విధముగా మనము భావించవచ్చునేమో గానీ, వచ్చే జన్మలో ఎక్కడ ఉంటామో చెప్పలేము. కాబట్టి ఇవన్నీ ఈ శరీరానికే పరిమితము, కాబట్టి తాత్కాలికమైనవి. ఇలా భౌతిక భావాలలో కూరుకుపోతే దాని వెనుక సూత్రధారియైన శ్రీకృష్ణున్ని అర్ధము చేసుకొనలేము. ఈ ప్రపంచములోని మానవులు, జంతువులే కాదు దేవతలు సైతమూ భగవంతున్ని
గుర్తించలేరు. అనగా సత్వగుణమున వున్నవారే గుర్తించలేకపోతే ఇక రజస్తమో గుణములలో నున్న వారి గురించి చెప్పనేల! కాబట్టి చైతన్య వంతులై త్రిగుణాలను అధిగమిసస్తే ముక్తులము కాగలుగుతాము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement