Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 20
20.
గుణానేతానతీత్య త్రీన్‌
దేహీ దేహసముద్భవాన్‌ |
జన్మమృత్యుజరాదు:ఖై:
విముక్తో మృతమశ్నుతే ||

తాత్పర్యము : దేహధారియగు జీవుడు దేహముతో కూడియున్న ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన, మరణ, వార్థక్యముల నుండియు మరియు వాని దు:ఖముల నుండియు విడవడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును.

భాష్యము : ఈ శ్లోకమునందు జీవన్ముక్తులుగా ఎలా కొనసాగవచ్చునో తెలియజేయటమైనది. అనగా ఈ శరీరములో ఉంటూ త్రిగుణములకు అతీతముగా ఉండుట. ఆధ్యాత్మిక జ్ఞానములో ఉన్నతి చెందినపుడు త్రిగుణముల ప్రభావము ఉండదు. అటువంటివారు ఈ శరీరము వదిలిపెట్టిన తరువాత ఆధ్యాత్మిక జగత్తునకు వెళ్ళెదరు. ఇక్కడ ఉన్నప్పుడు భగవద్భక్తిని చేసినట్లయితే ముక్తస్థితిలో ఉందురు. ఈ విషయము పద్దెనిమిదవ అధ్యాయమున తెలుపబడినది. అనగా త్రిగుణముల ప్రభావము తొలగిన తరువాతనే నిజమైన భక్తి మొదలవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement