Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 12
12.
లోభ: ప్రవృత్తిరారంభ:
కర్మణామశమ: స్పృహా |
రజస్యేతాని జాయంతే
వివృద్ధే భరతర్షభ ||

తాత్పర్యము : ఓ భరతవంశ శ్రేష్ఠుడా! రజోగుణము వృద్ధినొందినప్పుడు లోభము, కామ్యకర్మము, తీవ్రయత్నము, అణచసాధ్యముకాని కోరిక, తపన యను లక్షణములు వృద్ధినొందును.

భాష్యము : రజోగుణములో ఉన్న వ్యక్తి ఎప్పుడూ సంతృప్తి చెందలేడు. తన పదవిని పెంచుకొనుటకు ప్రాకులాడును. ఉండటానికి ఒక పెద్ద భవంతిని కట్టించుటే కాక, ఎల్లకాలమూ ఉండునట్లు దానిని అలంకరించును. వీటన్నింటికీ ఎంతో కష్టించి పని చేయును. ఎంత వీలైతే అంతగా ఆనందించుటకు ప్రయత్నించును. అతడి కోరికలకు అంతు ఉండదు. ఇవే రజోగుణు స్వభావుల లక్షణములు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement