Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 12

యే చైవ సాత్త్వికా భావా
రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్‌ విద్ధి
న త్వహం తేషు తే మయి ||

తాత్పర్యము : సత్వగుణమునకు గాని, రజో గుణమునకు గాని లేదా తమోగుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నియును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలిసికొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై యున్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందున్నను నేను వాటికి లోబడియుండను.

భాష్యము : ఈ ప్రపంచములోని భౌతిక కార్యాలన్నీ త్రిగుణముల ఆధీనములోనే జరుపబడతాయి. ఈ త్రిగుణములు భగవంతుని సృష్టే అయినా శ్రీ కృష్ణుడు వాటికి లోబడి ఉండడు. ప్రభుత్వ నియమాల వలన ప్రజలు శిక్షింపబడినా ఆ నియమాలను చేసిన రాజు వాటికి ఏ విధముగా అతీతుడై ఉంటాడో. అదే విధముగా సత్వ రజస్తమో గుణాలను సృష్టించినా కృష్ణుడు భౌతిక ప్రకృతిచే ప్రభావితము చెందడు. అందువలన ఆయనను ‘నిర్గుణుడు’ లేదా ‘గుణాతీతుడు’ అని అందురు. ఇది దేవాది దేవుడైన భగవంతుని యొక్క ఒక ప్రత్యేక లక్షణము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement