అధ్యాయం 14, శ్లోకం 11
11.
సర్వద్వారేషు దేహేస్మిన్
ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాత్
వివృద్ధం సత్త్వమిత్యుత ||
తాత్పర్యము : దేహ ద్వారములన్నియును జ్ఞానముచే ప్రకాశమానమైనప్పుడు సత్త్వ గుణము యొక్క వ్యక్తీకరణ అనుభవమునకు వచ్చును.
భాష్యము : త్రిగుణాలు ఏ విధముగా వ్యక్తమగునో ఈ శ్లోకాలలో విరవించబడినది. సత్త్వ గుణములో నున్న వ్యక్తి యొక్క నవ ద్వారాలు ప్రకాశవంతమవుతాయి. నవ
ద్వారాలు అనగా రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, నోరు, జననేంద్రియాలు మరియు గుదము. సత్త్వ గుణములో వస్తువులను యదార్థ స్థితిలో
గాంచగలుగుతారు, వినగలుగుతారు, రుచి చూడగలుగుతారు. అంతర్గతముగాను, బహిర్గతముగాను పరిశుద్ధులవుతారు. ప్రతి ద్వారము నందునా సుఖ భావన గోచరి
స్తుంది. ఇదే సత్త్వ గుణము యొక్క స్వభావము.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..