Thursday, November 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 10
10.
రజస్తమశ్చాభిభూయ
సత్త్వం భవతి భారత |
రజ: సత్త్వం తమశ్చైవ
తమ: సత్త్వం రజస్తథా ||

తాత్పర్యము : ఓ భరతవంశస్థుడా! కొన్నిమార్లు రజస్తమోగుణములను జయించి సత్త్వ గుణము ప్రబలమగుచుండును. మరికొన్ని మార్లు రజోగుణము సత్త్వ, తమో గుణములను జయించుచుండును. ఇంకొన్నిమార్లు తమోగుణము సత్త్వ, రజోగుణములను జయించుచుండును. ఈవిధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును.

భాష్యము : త్రిగుణము ఎప్పుడూ ఒక దానితో ఒకటి పోటీపడి మిగిలిన రెండింటినీ ఓడించి వేస్తాయి. మరికొంత సమయానికి వేరే గుణము మిగిలిన వాటిని ఓడిస్తుంది. వ్యక్తి యొక్క ప్రవర్తనను, కార్యాలను, ఆహార వ్యవహారాలను బట్టి అతడు ఏ గుణములో ఉన్నాడో చెప్పవచ్చును. ఈ విషయాలన్నీ రాబోవు అధ్యాయాలలో వివరించబడ్డాయి. కాబట్టి ప్రత్యేక అభ్యాసము చేత ఏ గుణాన్నైనా పెంపొందించుకొనవచ్చు. భక్తిలో ముందుకు వెళ్ళాలనుకునేవారు సత్త్వ గుణమును పెంపొందించుకుని దానికి మించిన శుద్ధ సత్వమునకు చేరుకున్నట్లయితే భగవత్తత్త్వాన్ని అర్థము చేసుకోగలుగుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement