అధ్యాయం 14, శ్లోకం 4
4.
సర్వయోనిషు కౌంతేయ
మూర్తయ: సంభవతి యా: |
తాసాం బ్రహ్మ మహద్యోని:
అహం బీజప్రద: పితా ||
తాత్పర్యము : ఓ కౌంతేయా! సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజప్రదాతయైన తండ్రియనియు అవగాహన చేసికొనవలెను.
భాష్యము : ఈ శ్లోకమున దేవాది దేవుడైన శ్రీ కృష్ణుడే జీవరాశుల యొక్క నిజమైన తండ్రి అని స్పష్టముగా తెలుపటమైనది. జీవులు దివ్యమైన భగవంతుని, మరియు భౌతిక ప్రకృతి కలయిక ద్వారా సాధ్యమయ్యిరి. వారిని అన్ని చోట్లనూ గాంచవచ్చును. భూమి మీద, నీటిలో, చివరకు అగ్నిలో కూడా జీవులు ఉందురు.. వారి తల్లి భౌతిక ప్రకృతి అయితే బీజమునిచ్చిన తండ్రి శ్రీకృష్ణుడు. అయితే వారి వారి పూర్వ కర్మలననుసరించి సృష్టి సమయములో వేరు వేరు రూపాలలో వేరు వేరు చోట్ల భౌతిక ప్రకృతి జన్మలను ఇచ్చును
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..