Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 1
ఓం శ్రీ పరమాత్మనే నమ:
అథ చతుర్దశోధ్యాయ:
గుణత్రయవిభాగయోగ:

1.
శ్రీభగవాన్‌ ఉవాచ
పరం భూయ: ప్రవక్ష్యామి
జ్ఞానానాం జ్ఞానముత్తమమ్‌ |
యద్‌ జ్ఞాత్వా మునయస్సర్వే
పరాం సిద్ధిమితో గతా: ||

తాత్పర్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెనను : దేనిని తెలిసికొని మునులందరును పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలో కెల్ల ఉత్తమమైన ఈ దివ్యజ్ఞానమును నీకిప్పుడు నేను మరల తెలియజేయుదును.

భాష్యము : గత అధ్యాయములో, వినయముతో జ్ఞానమును అభ్యసించినట్లయితే భౌతిక బంధానికి దూరము కావచ్చునని తెలియజేయబడినది. అలాగే త్రిగుణములతో సంపర్కమే ఈ భౌతిక జగత్తున బంధీ అగుటకు కారణమని వివరింపబడినది. ఇక ఈ అధ్యాయములో శ్రీ కృష్ణ భగవానుడు, ఆ త్రిగుణములు అననేమి? అవి ఏ విధంగా పనిచేస్తాయి, అవి ఏ విధంగా బంధిస్తాయి మరియు విడుదల చేస్తాయి అను విషయాలను వివరింపనున్నాడు. ఈ జ్ఞానము ఎప్పటివరకూ వివరించిన జ్ఞానము కన్నా బహు శ్రేష్టమైనది. దీనిని తెలుసుకున్న పలువురు జీవిత సార్ధకమును పొంది భగవద్ధామమును చేరిరని తెలియజేయటమైనది. కాబట్టి ఈ పద్నాల్గవ అధ్యాయమును అర్థము చేసుకున్నవారు కూడా జీవిత లక్ష్యమును చేరుకోగలరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement