Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 11

బలం బలవతాం చాహం
కామరాగవివర్జితమ్‌ |
ధర్మావిరుద్ధో భూతేషు
కామోస్మి భరతర్షభ ||

తాత్పర్యము : ఓ భరతవంశశ్రేష్ఠుడా! బలవంతులలోని కామరాగ రహితమైన బలమును మరియు ధర్మనియమములకు విరుద్ధము కానటువంటి
సంభోగమును నేనే అయియున్నాను.

భాష్యము : బలమున్న వ్యక్తి తన బలాన్ని బలహీనున్ని రక్షించటానికి ఉపయోగించాలే గాని దురాక్రమణకు ఉపయోగించరాదు. అలాగే మైధునమును ధర్మము ప్రకారము పిల్లలను కనుటకు మాత్రమే ఉపయోగించువలెను. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల బాధ్యత పిల్లలను కృష్ణచైతన్యవంతులను చేయుట.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement