అధ్యాయం 13, శ్లోకం 33
33
యథా సర్వగతం సౌక్ష్మ్యాత్
ఆకాశం నోపలిప్యతే |
సర్వత్రావస్థితో దేహే
తథాత్మా నోపలిప్యతే ||
తాత్పర్యము : సర్వత్ర వ్యాపించియున్నను సూక్ష్మత్వ కారణముగా ఆకాశము దేనితోను కలియనట్లు, బ్రహ్మ భావములో నిలిచిన ఆత్మ దేహము నందు నిలిచియున్నను దేహముతో కలియదు.
భాష్యము : గాలి ఎంత సూక్ష్మమైనదంటే అది నీరు, భూమి, మలము ఇలా అన్నింటి యందును ప్రవేశించును. అయితే గాలి దేనితోనూ మిశ్రితము కాదు. అలాగే ఆత్మ వేరు వేరు శరీరాల్లో ఉన్నప్పటికీ, తన సూక్ష్మ ప్రభావం వలన శరీరమునకు భిన్నముగానే తన స్థితిని కలిగి ఉంటుంది. కాబట్టి భౌతిక దృష్టికి ఆత్మ శరీరముతో ఉంటూ ఎలా వేరుగా ఉంటుందో అర్థము చేసుకొనుట సాధ్యము కాదు. మన ఆధునిక విజ్ఞానమునకు ద్వారా కూడా ఇది అంతుపట్టలేదు..
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..