అధ్యాయం 13, శ్లోకం 32
32
అనాదిత్వాన్నిర్గుణత్వాత్
పరమాత్మాయమవ్యయ: |
శరీరస్థోపి కౌంతేయ
న కరోతి న లిప్యతే ||
తాత్పర్యము : నిత్య దృష్టి కలిగినవారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను, నిత్యమైనదిగను, త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. ఓ అర్జునా! అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగియున్నను కర్మ నొనరింప దు మరియు బద్ధము కాదు.
భాష్యము : శరీరము పుట్టుట వలన ఆత్మ జనించినట్లు మనము భావిస్తాము కాని , ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ జనించదు. ఈ శరీరములో ఉన్నప్పటికీ ఆత్మ దివ్యమైనది మరియు శాశ్వతమైనది. కాబట్టి ఆత్మ నశింపబడదు. ఆత్మ ఆనంద భరితమైనది. ఆత్మ భౌతిక కార్యాలలో పాల్గొనదు. అనగా భౌతిక శరీరముతో తాను చేయు కార్యాలు, తనను బంధీ చేయవు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..