అధ్యాయం 13, శ్లోకం 27
27
యావత్సంజాయతే కించిత్
సత్త్వం స్థావరజంగమమ్ |
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్
తద్విద్ధి భరతర్షభ ||
తాత్పర్యము : ఓ భరతవంశశ్రేష్ఠుడా! స్థితిని కల్గియున్నట్టి స్థావర, జంగమములలో నీవు గాంచునదేదైనను క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలిసికొనుము.
భాష్యము : ఈ శ్లోకము నందు ఈ సృష్టికి పూర్వము నుండీ శాశ్వతముగా ఉండే భౌతిక ప్రకృతి మరియు జీవుని గురించి వివరించడము జరిగినది. ఈ సృష్టిలో మనము చూసే ప్రతీది ఈ రెండింట కలయిక ద్వారానే ఉద్భవించినవి. చెట్లు పర్వతాలు, కొండలు కదలనివైతే కొన్ని కదిలేవి. భౌతిక ప్రకృతిలో జీవరాశులను ప్రవేశపెట్టుట ద్వారా వాటి యందు పెరుగుదల అనేది సాధ్యమవుతుంది. వీరిద్దరినీ నియంత్రించే భగవంతుని ప్రమేయము వలన మాత్రమే ఇది సంభవిస్తుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..