Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 17
17
అవిభక్తం చ భూతేషు
విభక్తమివ చ స్థితమ్‌ |
భూతభర్తృ చ తద్‌ జ్ఞేయం
గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ||

తాత్పర్యము : పరమాత్ముడు జీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడును విభజింపబడక ఏకమై నిలిచియుండును. సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబళించునది మరియు వృద్ధినొందించునది అతడేయని అవగాహనము చేసికొనవలెను.

భాష్యము : భగవంతుడు ప్రతి జీవి హృదయములో పరమాత్మ రూపములో ఉండును. దాని అర్థము భగవంతుడు అనేక భాగములుగా విడిపోయెనా ? అని ఎవరైనా ప్రశ్నిచవచ్చును. లేదు భగవంతుడు ఒక్కడే ! మనకు భగవంతుడు విభజింపబడినట్లు కనిపించవచ్చును. ఎలా అనగా వేరు వేరు దేశాలలోని ప్రజలు మధ్యాహ్నపు సమయమున ‘సూర్యుడు నా తలపైనే ఉన్నాడు’ అని భావించుదురు కానీ మనందరికీ తెలుసు సూర్యుడు ఒక్కడే అని.

భగవంతుడు సృష్టి సమయములో అన్ని జీవరాశులను తన నుండి వెలికితీయును. సృష్టి ఉన్నంతకాలము పోషించి, ప్రళయ సమయమున తిరిగి అంతటినీ హరించివేయును. మరు సృష్టి ఉన్నంత కాలము పోషించి, ప్రళయ సమయమున తిరిగ అంతటినీ హరించి వేయును. మరు సృష్టి మొదలయ్యేవరకు అంతా భగవంతునిలోనే ఇమిడి ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement