Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 16
16
బహిరంతశ్చ భూతానామ్‌
అచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్‌ తదవిజ్ఞేయం
దూరస్థం చాంతికే చ తత్‌ ||

తాత్పర్యము : పరమాత్ముడు స్థావర, జంగమములైన సర్వజీవుల అంతర్భాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మత్వకారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును, అగ్రాహ్యుడును అయియున్నాడు. అతి దూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును.

భాష్యము : పరమ పురుషుడైన నారాయణుడు జీవుని లోపల, వెలుపల నివసిస్తూ ఉంటాడని వేదశాస్త్రాలు చెప్పుచున్నాయి. ఆయన ఈ భౌతిక జగత్తు నందు మరియు ఆధ్యాత్మిక జగత్తునందు కూడా ఉంటాడు. అనగా ఆయన మనకు రెతో దగ్గరగానూ మరియు ఎంతో దూరముగాను ఉంటాడు. అయితే భగవంతుడు ఎప్పుడూ దివ్యమైన ఆనందమును ఆస్వాదిస్తూ ఉంటాడు. కాబట్టి మనము భౌతికమైన మనస్సు, ఇంద్రియములతో ఆయనను అర్థము చేసుకొనలేము. అయితే భగవద్సేవ ద్వారా మనస్సు, ఇంద్రియములు పవిత్రీకరింపబడి, భగవంతుని పట్ల ప్రేము పెంపొందించుకోగలిగినట్లయితే సదా భగవంతుణ్ని చూడవచ్చునని బ్రహ్మసంహితము నందు పేర్కొనబడినద. భగవద్గీత 11వ అధ్యాయములో ‘భక్త్యా త్వనన్యయా శ క్య:’ ద్వారా కూడా అదే విషయము నిర్ధారింపబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement