అధ్యాయం 13, శ్లోకం 11
11
మయి చానన్యయోగేన
భక్తిరవ్యభిచారిణీ |
వివక్తదేశసేవిత్వమ్
అరతిర్జనసంసది ||
తాత్పర్యము : నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్యజనుల సహవాసమునందు అనాసక్తి,
భాష్యము : 16. భక్తి : అవ్యభిచారిణి :– శ్రవణ, కీర్తన, స్మరణాదులతో మొదలయ్యే నవ విధ భక్తి మార్గాన్ని అవలంబించుట.
17. వివిక్త దేశ సేవిత్వము:- ఆధ్యాత్మిక జీవితములో ఎదగాలనుకునే వారు ఇతర భౌతిక వాదులతో కలిసి మెలిసి ఉండలేరు. వారి లక్ష్యాలు వేరు కాబట్టి పొంతన కుదరదు. కాబట్టి దుస్సాంగత్యానికి దూరముగా ఏకాంతముగా ఉండాలని ఆశించుట.
18.అరతి : జన సంసది:- భక్తునికి సినిమాలు చూడటం, అనవసరపు ఆటలు ఆడటం లేదా భౌతిక వేడుకలు, జల్సాలపట్ల ఆసక్తి ఉండదు. ఇవన్నీ మనకున్న విలువైన సమయాన్ని వృథా చేస్తాయని గమనించగలుగుట.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..