Tuesday, November 26, 2024

గీతాసారం (ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 7

మత్త: పరతరం నాన్యత్‌
కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ ||

తాత్పర్యము : ఓ ధనంజయా ! నా కన్నను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తమూ నా పైనే ఆధారపడియున్నది.

భాష్యము : పరమ సత్యము నిరాకారమా లేదా సాకారమా అనే వాదన తరచు వస్తూ ఉంటుంది. అయితే భగవద్గీత అడుగడుగునా పరమసత్యము, దేవాది దేవుడు, ఒక వ్యక్తియని అతడు శ్రీకృష్ణుడేనని తెలియజేయటమైనది. ప్రత్యేకించి ఈ శ్లోకములో అదే విషయము నొక్కి వక్కాణించడమైనది. బ్రహ్మ
సంహితలో సైతమూ బ్రహ్మదేవుడు, గోవిందుడే సర్వ కారణములకూ కారణమని వేరే వాదనకు తావివ్వలేదు. కొందరు శ్వేతా స్వతర ఉపనిషత్తు (3.10) శ్లోకము నందు ‘అరూపం’ అని చెప్పబడినదని వాదించుదురు. అయితే దానికి ముందు రెండు శ్లోకములలో పురుషునిగా వర్ణించుట ము దీనికి సరైన అవగాహనను ఇస్తుంది. అనగా భగవంతుని రూపము భౌతికము కాదని, దివ్య మంగళ స్వరూపము అని దాని అర్థము. కాబట్టి పరమ సత్యము, ఒక వ్యక్తి అని, దేవాదిదేవునిగా తన భౌతిక ఆధ్యాత్మిక శక్తులచే సర్వత్రా విస ్తరించి ఉన్నాడని అవగతమవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement