Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 6,7

6.
యే తు సర్వాణి కర్మాణి
మయి సన్న్యస్య మత్పరా: |
అనన్యేనైవ యోగేన
మాం ధ్యాయంత ఉపాసతే ||

7.
తేషామహం సముద్దర్తా
మృత్యుసంసారసాగరాత్‌ |
భవామి నచిరాత్‌ పార్థ
మయ్యావేశితచేతసామ్‌ ||

6-7 తాత్పర్యము : కాని ఓ పార్ధా! సర్వ కర్మలను నాకు అర్పించి అన్యచింతలేక నాకు భక్తులై, మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు, నా భక్తియుత సేవలో నన్ను అర్చించెడివారిని శీఘ్రమే జనన, మరణమను సంసారసాగరము నుండి ఉద్ధరింతును.

భాష్యము : భక్తులు ఎంతో అదృష్టవంతులని అతి త్వరలోనే భగవంతుడు వారిని ఉద్ధరిస్తాడని ఇక్కడ స్పష్టముగా తెలియజేయుటమైనది. శుద్ధ భ క్తి చేసినట్లయితే భగవతుడు గొప్పవాడని, జీవుడు అతని దాసుడని, అతని కర్తవ్యము భగవంతుని సేవ చేయుట అని, లేనట్లయితే మాయకు చేయవలసి వస్తుందని తెలుసుకుంటాడు. ఇతకు ముందే తెలుపబడినట్లు భగవంతున్ని భక్తి శ్రద్ధలతో పూజి ంచుటయే ఉత్తమము. అనగా మనస్సును పూర్తిగా భగవంతునిపై లగ్నము చేయవలెను. భక్తుడు ఏ కార్యము చేసినా భగవంతుని ప్రసన్నార్థము చేయవలెను. అర్జునుని వలె కృష్ణుని కోసము ఏదైనా త్యాగము చేయుటకు సిద్ధముగా ఉండవలెను. భక్తుడు తన దినచర్యలను కొనసాగిస్తూనే ”హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే” అను మంత్రాన్ని జపిస్తూ కృష్ణున్ని స్మరించవచ్చును. అటువంటి భక్తుడ్ని కృష్ణుడు స్వయముగా గరుడ వాహనంపై వచ్చి ఈ సంసారసాగరము నుండి ఉద్దరించును. సముద్రములో గజ ఈతగాడు సైతమూ నావను ఆశ్రయించవలసినదే. అలాగే తమ యోగబలముతో వేరు వేరు లోకాలకు వెళ్ళే యోగులు సైతమూ, భ గవద్దామానికి వారి స్వయంశక్తితో వెళ్ళలేరు. భక్తుడు భగవంతున్ని శరణు పొందుటవలన భగవంతుడే భాద్యత తీసుకుంటాడు. ఎ టువంటి పాపినైనా ఉద్ధరించగల సామర్ధ్యము భగవంతునికే ఉన్నది. కనుక అందరూ స్వప్రయత్నాలను వీడి భగవంతున్నే ఆశ్రయించవలెను.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement