అధ్యాయం 12, శ్లోకం 3,4
3.
యే త్వక్షరమనిర్దేశ్యమ్
అవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ
కూటస్థమచలం ధ్రువమ్ ||
4.
సంనియమ్యేంద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయ: |
తే ప్రాప్నువంతి మామేవ
సర్వభూతహితే రతా: ||
3-4 తాత్పర్యము : ఇంద్రియాతీతమును, సర్వవ్యాపకమును, అచింత్యమును, మార్పురహితమును, స్థిరమును, అచలమును అగు అవ్యక్త తత్త్వమును(పరతత్త్వపు నిరాకార భావనను) సర్వేంద్రియ నిగ్రహము మరియు స ర్వుల యెడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైన వారు సైతము అంత్యమున నన్ను పొందుదురు.
భాష్యము : ప్రత్యక్షముగా కృష్ణున్ని పూజింపక, పరోక్ష పద్ధతిని అవలంభించు వారు కూడా చివరకు కృష్ణున్నే చేరుకొందురని ఇక్కడ తెలియజేయటమైనది. అయితే వారు అనేక జన్మల కఠోర తపస్సు తరువాత కృష్ణున్ని శరణు పొందుదురని ఏడవ అధ్యాయములో తెలియజేయటమైనది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్పద్యతే. అయితే జ్ఞానవంతుడగుటకు ఇంద్రియ నిగ్రహము ద్వారా భౌతిక కార్యాలన్నీ ఆపివేసి, ఆత్మ పరమాత్మలను చూడవలసి ఉంటుంది. మానవుల. జ ంతువుల శరీరములకు అతీతముగా ఆత్మను వాటి సమానత్వమును చూడవలసి ఉంటుంది. మానవుల, జంతువుల శరీరములకు అతీతముగా ఆత్మను వాటి సమానత్వమును చూడవలసి ఉంటుంది. ఇదంతా చేసి మానవసేవలో నిమగ్నమై, సర్వమానవాళికి సంక్షేమ కార్యాలను ఒనర్చి చివరకు కృష్ణున్ని చేరుకొనవలసినదే. లేనిదే వారి అన్వేషణ అసంపూర్ణము కావు. ఇటువంటి కఠోర తపస్సు చేయుట సామాన్య మానవునికి సాధ్యము కాని పని.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..