అధ్యాయం 12, శ్లోకం 2
2.
శ్రీభగవాన్ ఉవాచ
మయ్యావేశ్య మనో యే మాం
నిత ్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతా:
తే మే యుక్తతమా మతా: ||
తాత్పర్యము : శ్రీకృష్ణభగవానుడు పలికెను : నా స్వీయరూపము నందు మనస్సును లగ్నము చేసి దివ్యమును, ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైనవారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును.
భాష్యము : అర్జునుని ప్రశ్నకు సమాధానమిస్తూ, కృష్ణుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో తన రూపాన్ని పూజించెదరో అతడే యోగములో పరిపూర్ణుడని తెలియజేయుచున్నాడు. అటువంటి కృష్ణచైతన్య వ్యక్తి అన్ని కార్యాలను కృష్ణుని కోసమే చేస్తాడు. కాబట్టి భౌతిక కార్యలంటూ ఏమీ ఉండవు. శుద్ధ భక్తుడు ఎల్లప్పుడూ కృష్ణుని సేవలో నిమగ్నుడై ఉంటాడు. తాను కీర్తన చేస్తూ కృష్ణుని సేవలో నిమగ్నుడై ఉంటాడు. తాను కీర్తన చేస్తూ కృష్ణుని గురించి వింటూ లేదా చదువుతూ, వంట చేస్తూ, దానికి కావలసిన సామాగ్రిని సేకరిస్తూ, దేవాలయమును శుభ్రపరుస్తూ ఇలా నిరంతరమూ కృష్ణుని కోసమే ఏదో ఒక కార్యాన్ని చేస్తూ ఉంటాడు. అలా కృష్ణుని పట్ల సమాధితో తన కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..