Sunday, November 24, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 54

54.
భక్త్యా త్వనన్యయా శక్య:
అహమేవంవిధోర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన
ప్రవేష్టుం చ పరంతప ||

తాత్పర్యము : ఓ ప్రియమైన అర్జునా! కేవలము అనన్యభక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింప నగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు.

భాష్యము : గురువు మార్గదర్శకత్వములో చేసే అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే కృష్ణున్ని అర్థము చేసుకొనగలము. ఇక్కడ ”తు” అను పదము వేరే ఏ ఇతర మార్గముల ద్వారా అనగా తాత్త్విక కల్పనల ద్వారా లేదా వేదాధ్యయనము ద్వారా కృష్ణున్ని అర్థము చేసుకొనలేరని స్పష్టపరచుచున్నది. కృష్ణుడు, అర్జునుడు మరియు వేదశాస్త్రాల ద్వారా మనము ఇప్పటికే అర్థము చేసుకున్నదేమిటంటే కృష్ణుని ద్విభుజరూపమే, చతుర్భుజ రూపములైన మహావిష్ణువు, నారాయణునికి మరియు విశ్వరూపమునకు మూలము అని. అర్జునుని వంటి భక్తులకు విశ్వరూపము ప్రసన్నకరము కాదని, శ్రీకృష్ణుడుగా ద్విభుజరూపముతోనే వారు ప్రేమైక సంబంధాలను కలిగి ఉంటారని నిరూపించబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement