Saturday, September 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 51
51.
అర్జున ఉవాచ
దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం జనార్దన |
ఇదానీమస్మి సంవృత:
సచేతా: ప్రకృతిం గత: ||

తాత్పర్యము : ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్యరూపమును గాంచినంత ఇట్లు పలికెను : ఓ జనార్థనా! అత్యంత సుందరమైన ఈ నీ మానవరూపమును గాంచి శాంతచిత్తుడనై నా సహజస్వభావమును పొందితిని.

భాష్యము : ఇక్కడ ”మానుషం రూపం” అను పదము స్పష్టముగా దేవాది దేవుని నిజరూపము ద్విభుజరూపమని తెలియజేయుచున్నాది. కృష్ణుడు ఒక సామాన్యమైన వ్యక్తి అని నిందించే వారికి ఆయన దివ్యత్వము తెలియదని స్పష్టమవుచున్నది. అతడు సామాన్యడైతే ఆ విశ్వరూపాన్ని, చతుర్భుజ నారాయణ రూపాన్ని ఎలా చూపగలిగేవాడు? ”కృష్ణుడిలోని నారాకార బ్రహ్మము మాట్లాడుతుంది” అని వ్యాఖ్యానించేవారు భగవద్గీతా పాఠకులను తప్పుదోవ పట్టించి ఎంతో అన్యాయము చేస్తున్నారు. శుద్ధ భక్తులకు అసలు విషయము స్పష్టముగా తెలుసుకాబట్టి వారిని తప్పుదోవ పట్టించలేరు. సూర్యునివలె భాషిస్తున్న భగవద్గీతా శ్లోకాలకు దీపపు కాంతి వంటి వ్యాఖ్యానాలు అవసరంలేదని అర్థమగుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement