Saturday, September 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 49
49.
మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్‌ |
వ్యపేతభీ: ప్రీతిమనా: పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ||

తాత్పర్యము : నా ఈ ఘోరరూపమును చూచి నీవు కలత నొందినవాడవు, భ్రాంతుడవు అయితివి. అదియంతయు నిపుడు అంతరించు గాక! ఓ భక్తుడా! అన్ని కలతల నుండియు విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంతమనస్సుతో ఇప్పుడు గాంచుము.

భాష్యము : అర్జునుడు మొదటి నుండి ద్రోణున్ని, భీష్ముడ్ని సంహరించుటకు వెనుకాడుచుండెను. కానీ ద్రౌపదిని అవమానించినప్పుడు వారు తమ ధర్మాన్ని నిర్వహింపలేక పోవుట వలన వారికి మరణమే శిక్ష అని కృష్ణుడు నిర్ణయించి ఉన్నాడు. అది విశ్వరూప దర్శనములో తేటతెల్లము చేశాడు. అయితే భక్తులు అటువంటి ఘోర కార్యాలను చేయలేరు కాబ ట్టి అర్జునుడు చతుర్భుజ రూపమును చూపమని కోరెను. విశ్వరూపముతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోలేరు కనుక భక్తులు ఆ రూపాన్ని కోరుకోరు. ద్విభుజ రూపంలో ఉండే కృష్ణున్ని పూజించవచ్చు, అలంకరించవచ్చు ఈ విధముగా ప్రేమైక సంబంధాన్ని కలిగి ఉండవచ్చు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement