అధ్యాయం 11, శ్లోకం 44
44.
తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదాయే త్వామహమీశమీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు:
ప్రియ: ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||
తాత్పర్యము : నీవు ప్రతిజీవికి పూజనీయుడైన దేవదేవుడవు. కనుకనే సాష్టాంగపడి గౌర్వపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలిని ప్రియుడు సహించునట్లు, నీ యెడ నొనరించిన నా తప్పులను దయతో సహింపుము.
భాష్యము : కృష్ణుని భక్తులు కృష్ణున్ని కొడుకుగా, భర్తగా, స్నేహి తుడిగా లేదా ప్రభువుగా సంబంధాన్ని కలిగి ఉండవచ్చును. అర్జునుడు కృష్ణునితో స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉండెను. ఏ విధముగా నైతే ఒక తండ్రి, భర్త, ప్రభువు తప్పులను క్షమిస్తాడో అలాగే శ్రీకృష్ణుడూ తన భక్తులను క్షమిస్తాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..