Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 43
43.
పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్‌ |
న త్వత్సమో స్త్యభ్యధిక: కుతోన్యో
లోకత్రయే ప్యప్రతిమప్రభావ ||

తాత్పర్యము : స్థావర, జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్యపూజనీయుడగు పరమ ఆధ్యాత్మిక గురుడవు నీవే. నీతో సమానమైనవాడు గాని, ఏకమైనవాడు గాని మరొకడుండడు. ఓ అపరిమిత శక్తి సంపన్నుడా! అట్టి యెడ నీ కన్నను అధికుడు ముల్లోకములలో ఎవడుండును?

భాష్యము : ఒక కొడుకు ఏ విధమైన గౌరవాన్ని తన తండ్రికి ఇస్తాడో అలాంటి గౌరవాన్ని దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి కూడా ఇవ్వవలెను. వేదాలను ఆదిలో బ్రహ్మకు మరియు నేడు భగవద్గీతను అర్జునునికి భోదించుట వలన శ్రీకృష్ణుడే ఆది గురువు అనబడతాడు. కాబట్టి ఎవరినైనా గురువుగా స్వీకరించాలంటే వారు కృష్ణుడి నుండి వస్తున్న పరంపరలో ఉండి తీరవలెను. ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో ఎవరూ ఆయనకు సములు గానీ అధికులు గానీ లేరు. ఆయన కార్యాలు దివ్యమైనవి. వాటిని ఎరిగినవారు ఈ ప్రపంచానికి తిరిగిరారు. కాబట్టి అందరూ ఆయన సూచనలను పాటించి జీవితాన్ని సార్థకము చేసుకొనవలెను. ఇలా అందరికీ ప్రభువైన శ్రీకృష్ణునికి అన్ని విధాలా ప్రణామములు అర్పించవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement