అధ్యాయం 11, శ్లోకం 39
39.
వాయుర్యమో గ్నిర్వరుణ శ్శశాంక:
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తేస్తు సహస్రకృత్వ:
పునశ్చ భుయోపి నమో నమస్తే ||
తాత్పర్యము : వాయువును మరియుప రమ నియామకుడును నీవే! అగ్ని, జలము, చంద్రుడవు నీవే! ఆదిజీవియైన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే. కనుకనే నీకు వేయు నమస్కారములు జేయుచు, మరల మరల వందనములనర్పించుచున్నాను.
భాష్యము : ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణున్ని వాయువుగా సంభోదిస్తున్నాడు. ఎందువలననగా వాయువు సర్వత్రా వ్యాపించి ఉండుటచే అందరు దేవతలలోకీ ముఖ్యమైనవాడు. అలాగే మొట్టమొదటి జీవియైన బ్రహ్మకు కూడా తండ్రి కనుక ‘ప్రపితామహా’ అని కృష్ణున్ని సంభోదిస్తూ ఉన్నాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..