అధ్యాయం 11, శ్లోకం 32
32.
శ్రీభగవాన్ ఉవాచ
కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత: |
ఋతే పిత్వాం న భవిష్యంతి సర్వే
యేవస్థితా: ప్రత్యనీకేష/ యోధా: ||
తాత్పర్యము : దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను: నేను ఘనమైన లోకవినాశకర కాలమును. జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చుటకు అరుదెంచితిని. నీవు(పాండవులు) తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరును చంపబడనున్నారు.
భాష్యము : వేదాలలో కాలభైరవుని రూపములో భగవంతుడు బ్రాహ్మణులను, క్షత్రియులను సైతము కబళిస్తాడని తెలుపడబడినది. ఇక్కడ కృష్ణుడు ఆ కాలభైరవుని రూపములో పాండవులను తప్ప మిగిలిన వారందరినీ కబళిస్తాడని సూచిస్తున్నాడు. అర్జునుడు యుద్ధము వలన విపరీత పరిణామాలు సంభవిస్తాయిన, యుద్ధానికి సుముఖముగా లేడు. దానికి సమాధానంగా ఇక్కడ కృష్ణుడు అర్జునుడు యుద్ధము చేయకున్నా వారి నాశనము తప్పదని, అదదే తన సంకల్పమని తెలియజేయుచున్నాడు. అనగా వారికి మృత్యువు తప్పదు. కాలము అన్నింటినీ హరించి వేస్తుంది. భగవంతుని నిర్ణయము ప్రకారము సృష్టింపబడినవన్నీ నశించక మానవు. ఇదే ప్రకృతి నియమము.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..