అధ్యాయం 11, శ్లోకం 24
24.
నభ:స్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాన నం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో ||
తాత్పర్యము : ఓ సర్వవ్యాపక విష్ణూ! పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు, విప్పారిన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను గాంచి నా మనస్సు భీతిచే కలత నొందినది. మనోస్థిరత్వమును గాని, సమత్వమును గాని నేను ఏ మాత్రము నిలుపుకొనలేకున్నాను.
భాష్యము : లేదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..