Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 14
14.
తత: స విస్మయావిష్టో
హృష్టరోమా ధనంజయ: |
ప్రణమ్య శిరసా దేవం
కృతాంజలిరభాషత ||

తాత్పర్యము : అంతట సంభ్రమునకు గురియైనవాడును, ఆశ్చర్యకితుడైనవాడును, రోమాంచితుడైనవాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు అంజలిబద్ధుడై దేవదేవుని ప్రార్థింపదొడగెను.

భాష్యము : దివ్య చక్షువులతో విశ్వరూప దర్శనము గాంచునపుడు అర్జునునికి కృష్ణునికి మధ్య ఉన్న మైత్రి సంబంధము, అద్భుత రసముగా మారినది. అంతట అరజునుడు విశ్వరూపము యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించనారంభించెను. కృష్ణుడు అఖిల రసమూర్తి. ఆయన అన్ని రసాలకు మూలము. ఆ విధముగా ఈ ప్రస్తుత పరిస్థితిలో వారి సంబంధము అద్భుత రసముచే నిండి ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement