Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 11, శ్లోకం 8
8.
న తు మాం శక్యసే ద్రష్టుమ్‌
అనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షు:
పశ్య మే యోగమైశ్వరమ్‌ ||

తాత్పర్యము : కాని ప్రస్తుత నేత్రములచే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్యనేత్రములను ఒసగుచున్నాను. నా యోగ వైభవమును వీక్షింపుము!

భాష్యము : శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని ద్విభుజరూపాన్ని చూడాలని కోరుకుంటారు కాని విశ్వరూపాన్ని కాదు. కాబట్టి ఎవరైనా విశ్వరూపాన్ని చూఐడాలనుకుంటే వారు తమ దృష్టిన మార్చుకోవలసి ఉంటుందే గాని మనస్సును కాదు. ఇక్కడ కృష్ణుడు అర్జునునికి దివ్య చక్షువులు ప్రసాదిస్తూ ఉన్నాడు. భక్తులు కృష్ణుని తో సంబంధాన్ని కోరుకుంటారు కాబట్టి వారు కృష్ణుని ఐశ్వర్యాలను చూడాలనుకోరు. అయితే అర్జునుని ద్వారా గురు పరంపర మొదలు పెట్టబడుచున్నది కాబట్టి ఆయన విశ్వరూపాన్ని చూపమని కోరెను. తద్వారా కృష్ణుడు కేవలము మాటలతోనే భగవంతుణ్ని అని చెప్పటమే కాక నిరూపించి చూపించినాడని అందరికీ వెల్లడి చేసెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement