Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 6
6.
పశ్యాదిత్యాన్‌ వసూన్‌ రుద్రాన్‌
అశ్వినౌ మరుతస్తథా |
బహూన్యదృష్టపూర్వాణి
పశ్యాశ్చర్యాణి భారత ||

తాత్పర్యము : ఓ భారతా! ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీకుమారులనను, సమస్త ఇతర దేవతలను గాంచుము. అలాగుననే ఇదివరకెన్నడును ఎవ్వరును కనని, వినని పలు అద్భుత విషయములను గాంచుము.

భాష్యము : అర్జునుగు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు మరియు ఎంతో జ్ఞానమును కలిగి ఉన్న వ్యక్తి. అయితే అతడు కూడా శ్రీకృష్ణున్ని గురించి పూర్తిగా తెలుసుకోలేక పోయాడు. మానవులు ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని అద్భుతాలను చూడమని ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించుచూ ఉన్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement