Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 11, శ్లోకం 4
4.
మన్యసే యది తచ్ఛక్యం
మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం
దర్శయాత్మానమవ్యయమ్‌ ||

తాత్పర్యము : హే ప్రభూ! యోగీశ్వరా! నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము.

భాష్యము : కేవలము భక్తి ద్వారా మాత్రమే ఎవరైనా భగవంతుణ్ని చూడగలుగుతారే గాని తమ స్వశక్తితో కాదు. అల్పుడైన జీవునికి భగవంతుడ్ని చూడటము గానీ, అర్థము చేసుకోవటము గాని సాధ్యపడదు. కాబట్టి అర్జునుడు తన మేధాశక్తి మీద ఆధారపడక ఒక జీవుడుగా తనకున్న లోపాలను గుర్తించి శ్రీకృష్ణున్ని అర్థిస్తూ ఉన్నాడు. కృష్ణుడు ”యోగీశ్వరుడు” కనుక తాను తలచుకొంటే, అనంతుడైన వాడు అల్పునికి కూడా కనిపించే విధముగా దృష్టిని ఇవ్వగలడు. కాబట్టి ఎవరూ తమ స్వశక్తితో భగవంతుని చూడలేరని, కేవలము భక్తితో ప్రార్థనా పూర్వకముగా మాత్రమే ఆ అనంతుణ్ని దర్శించగలరని మనము అర్థము చేసుకొనవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement