అధ్యాయం 11, శ్లోకం 2
2.
భవాప్య¸° హి భూతానాం
శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్త: కమలపత్రాక్ష
మహాత్మ్యమపి చావ్యయమ్ ||
తాత్పర్యము : ఓ కమలపత్రాక్ష! సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసితిని మరియు అవ్యయములైన నీ మహాత్మ్యములను కూడా గుర్తించితిని.
భాష్యము : అర్జునుడు ఆనందముతో శ్రీకృష్ణున్ని కమలపత్రాక్షా! కమలముల వంటి కళ్ళు కలిగినవాడా! అని సంభోదిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు అధ్యాయములలో శ్రీకృష్ణుడే సర్వ సృష్టి, స్థితి, లయలకు కారణుడని తనకు సవివరముగా వివరించుటచే బాగుగా అర్థమైనదని, అంతేకాక కృష్ణుడు సర్వత్రా విస్తరించి యున్నా అతడు వేరుగా వ్యక్తిత్వాన్ని కలిగి యుంటాడని కూడా అర్థము చేసుకున్నానని తెలియజేయుచున్నాడు. కృష్ణుని నుండే అన్నీ వస్తున్నా, ఆయన మాత్రము అన్నింటి యందు స్వయముగా ఉండడు. శ్రీకృష్ణుని అన్ని గుణాలలోకి ఇది మహత్తరమైనది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..